తండ్రీకొడుకుల పాత్రల్లో పవర్ స్టార్ ?

Published on Nov 23, 2020 10:14 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన 28వ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా కథ గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. కథలో పవన్ రెండు పాత్రల్లో కనిపించబోతునాడని.. ప్లాష్ బ్యాక్ లో వచ్చే తండ్రి పాత్రలోనూ..
అలాగే లైవ్ లో వచ్చే కొడుకు పాత్రలోనూ పవన్ కనిపిస్తాడట. కాగా ఈ సినిమా పై పవన్ ఫ్యాన్స్ బాగా ఆసక్తి చూపిస్తున్నారు.

పైగా గతంలో హరీష్, పవన్ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ పవన్ కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. అప్పటికే వరుస ప్లాప్స్ లో ఉన్న పవన్.. గబ్బర్ సింగ్ తో ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేశాడు. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’తో క్రిష్ సినిమా కూడా చేస్తున్నాడు.

ఇక క్రిష్ సినిమా కోసం పవన్ కళ్యాణ్ మొదటిసారి పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో సినిమా చేస్తుండటంతో అభిమానుల్లోనే కాదు ప్రేక్షకులందరిలో మంచి ఆసక్తి నెలకొంది. ఈ సినిమా పూర్తవగానే హరీష్ శంకర్ చిత్రం మొదలుకానుంది.

సంబంధిత సమాచారం :

More