మాస్ అండ్ పవర్ ఫుల్ గా “టక్ జగదీష్” ట్రైలర్

Published on Sep 1, 2021 6:32 pm IST

నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం టక్ జగదీష్. ఈ చిత్రం లో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. నాజర్, జగపతి బాబు, రావు రమేష్, డానియల్ బాలాజీ, తీరువీర్, రోహిణి, దేవదర్షిని మరియు ప్రవీణ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకం పై సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది లు నిర్మిస్తున్నారు.

తాజాగా టక్ జగదీష్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ ట్రైలర్ లో నాని మునుపెన్నడూ లేని విధంగా మరింత పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. భూదేవి పురం ఊరి చుట్టూ ఈ చిత్రం కథ కొనసాగతుంది. ఐనోళ్ళ కంటే ఆస్తులు విలువైనవి కాదని, రక్త సంబంధం ముఖ్యం అంటూ జగపతి బాబు చెప్పే డైలాగ్ హైలెట్ గా ఉంది. అంతేకాక భూ కక్షలు లేని భూ దేవి పురాన్ని చూడాలనేది తన నాన్న కోరిక అని, ఇప్పుడు అది నా బాధ్యత అంటూ సినిమా స్టోరీ ను ట్రైలర్ లో చెప్పే ప్రయత్నం చేశారు నాని. అంతేకాక కుటుంబ సభ్యుల మధ్య ఉండే సన్నివేశాలు, సంభాషణలతో ట్రైలర్ మరింత ఎమోషనల్ గా ఉంది. అన్నిటికంటే నాని టక్ జగదీష్ గా ఎలివేట్ చేస్తూ ఉన్న ఫైట్స్ ట్రైలర్ లో హైలెట్ గా నిలిచాయి అని చెప్పాలి.

ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గోపి సుందర్ అందిస్తున్నారు. ప్రావిన్ పడి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రసాద్ మురెళ్ళ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. ఈ సినిమా కోసం నాని చేసిన హార్డ్ వర్క్ ట్రైలర్ లో కనిపిస్తుంది అని చెప్పాలి. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 10 వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :