సెప్టెంబర్ 1న సెన్సార్ కి వెళ్లనున్న రవితేజ ‘పవర్’

సెప్టెంబర్ 1న సెన్సార్ కి వెళ్లనున్న రవితేజ ‘పవర్’

Published on Aug 28, 2014 8:12 PM IST

Power

‘బలుపు’ సినిమాతో సక్సెస్ అందుకున్న మాస్ మహారాజ రవితేజ పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్ ‘పవర్’ సినిమాతో సంవత్సర కాలం గ్యాప్ తర్వాత మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రవిఎతజ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తున్న ఈ మూవీ ద్వారా బలుపు మూవీ రైటర్ బాబీ డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. తమన్ అందించిన ఆడియో ఆల్బమ్ ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.

దాదాపు అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ కాపీని సెప్టెంబర్ 1న సెన్సార్ కోసం సెన్సార్ బోర్డు కి పంపనున్నారు. ఇటీవలే విడుదలైన ఈ మూవీ థియేటర్ ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్ రావడమే కాకుండా అమాంతం అంచనాలను పెంచేసింది. ఈ చిత్ర నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ కూడా సినిమా అనుకున్నదానికంటే బాగా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాడు. అంతే కాకుండా ఈ చిత్ర టీంపై ప్రశంశల జల్లు కురిపిస్తున్నారు.

రవితేజ మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమాలో హన్సిక, రెజీన హీరోయిన్స్ గా నటించారు. బ్రహ్మానందం, సప్తగిరి, పోసాని కృష్ణమురళి కామెడీ కూడా ఈ సినిమాకి బాగా హెల్ప్ అవుతుందని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు