భారతదేశం అంతా ముద్దుగా బాపూజీ అని పిలుచుకునే గాంధీజీ జయంతి సందర్భంగా భారత్ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన కార్యక్రమం స్వచ్చ భారత్. ఈ స్వచ్చ భారత్ లో ఇప్పటికే పలువుర్ హీరోలు, సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని స్వచ్చ భారత్ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఎన్నుకున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ స్వచ్చ భారత్ క్లీనింగ్ ప్రోగ్రాంలో పాల్గొంటానని తెలిపాడు.
నెల్లూరులోని వెంకటాచలంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘స్వచ్చ భారత్ అనేది ఒక లాంగ్ టర్మ్ మిషన్. ఇది బిజెపి లేదా మోడీల ఒక్కరి కలే కాదు ఇది భారతీయులందరి బాధ్యత అని’ అన్నాడు. అలాగే పవన్ మాట్లాడుతూ ‘ప్రతి ఒక్క భారత్ పౌరుడు తమ పనిని తాము సక్రమంగా నిర్వర్తిస్తేనే మనం దేశం అభివృద్ధి చెందుతుంది. అలాగే స్వచ్చ భారత్ అనేది ఫోటోలలో పోజులివ్వడానికి చేసేది కాదని’ అన్నాడు. ఈ వేడుకని నెల్లూరు సీనియర్ బిజెపి నేత అయిన వెంకయ్య నాయుడు దగ్గరుండి చూసుకున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫంద్నవిస్ కూడా ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు.


