నితిన్ చిన్నదానితో పాటు రిలీజ్ అయిన పవర్ స్టార్ న్యూ స్టిల్

pawan-kalyan
యంగ్ హీరో నితిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఎంతలా ప్రేమిస్తాడు, ఆరాధిస్తాడు అనే విషయాన్ని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నితిన్ కూడా చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ని స్క్రీన్ మీద చూసినప్పటి నుంచే తనకి హీరో కావాలనే ఆశ పుట్టిందని తెలియజేశాడు. నితిన్ తన అభిమానాన్ని ప్రతి సినిమాలోనూ ఏదో ఒకరకంగా చూపిస్తూనే వస్తున్నాడు. తన సినిమాలో పవన్ పోస్టర్స్, లేదా పవన్ సాంగ్ లాంటివి పెడుతుంటాడు.

నితిన్ నటించిన ‘చిన్నదాన నీకోసం’ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. టైటిల్స్ కంటే ముందే స్పెషల్ థాంక్స్ టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని వేయడమే కాకుండా ఇప్పటివరకూ గోపాల గోపాల మూవీ నుంచి రిలీజ్ చెయ్యని ఓ స్టిల్ ని కూడా స్క్రీన్ పై వేసారు. ఈ స్టిల్ లో పవన్ కళ్యాణ్ వైట్ అండ్ వైట్ సూట్ లో స్పెషల్ గా డిజైన్ చేసిన బైక్ పై ఉంటాడు.

అలాగే సినిమాలో కూడా పలుసార్లు పవన్ కళ్యాణ్ పేరుని ఉపయోగించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి కరుణాకరన్ డైరెక్టర్. మిష్తి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

Exit mobile version