‘పడి పడి లేచె మనసు’ కి రెండు మిలియన్లు !

Published on Feb 3, 2019 12:01 am IST


హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వచ్చిన చిత్రం ‘పడి పడి లేచె మనసు’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 21 న ప్రపంచవ్యాప్తంగా మంచి అంచనాల మధ్య విడుదలై వసూళ్లను రాబట్టడంలో విఫలమై బాక్సాఫిస్ వద్ద ఈ చిత్రం ఫెయిల్యూర్ గా నిలిచింది.

అయితే ఈ సినిమా ప్లాప్ అయిన, ఈ సినిమా ఆడియో మాత్రం మంచి హిట్ అయింది. అందులో ముఖ్యంగా ఈ సినిమా టైటిల్ సాంగ్ చాలా బాగా ఆకట్టుకుందనే చెప్పాలి. రచయిత కృష్ణ కాంత్ వ్రాసిన సాహిత్యానికి తగినట్లుగా విశాల్ చంద్రశేఖర్ సమకాలీనమైన బీట్స్ ను అందించి ఓ ప్రత్యేకమైన టైటిల్ సాంగ్ లా ఈ సాంగ్ ని తీర్చిదిద్దారు.

కాగా తాజాగా ఈ వీడియో సాంగ్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకెళ్తుంది. ఇప్పటివరలు 2 మిలియన్ల పైగా వ్యూస్‌ తెచ్చుకుని.. మంచి హిట్ సాంగ్ అనిపించుకుంది.

సంబంధిత సమాచారం :