ప్రభాస్ నెక్స్ట్ మూవీ హిందీలో కూడా ఉంటుంది.. హిందీ మీడియాకు క్లారిటీ

Prabhas2

‘సాహో’ చిత్రం తెలుగులో లాభాల్ని తెచ్చిపెట్టలేకపోయినా హిందీలో మాత్రం భారీ వసూళ్లను రాబట్టింది. ఈ కలెక్షన్లతో బాలీవుడ్లోకి బలమైన ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్. అక్కడి బడా హీరోలకు కూడా అంత సులభం కాని రూ.150 కోట్లకి పైగా నెట్ వసూళ్లను ‘సాహో’తో సాధించాడు ప్రభాస్. ఈ సంగతి ప్రతి హిందీ ప్రేక్షకుడికి తెలుసు. చాలామంది ‘సాహో’ను చూపించి డిజాస్టర్ సినిమాలు తీసిన దర్శకులు, హీరోలకు అక్షింతలు కూడా వేశారు వాళ్లు.

కానీ హిందీ వార్తా మాధ్యమాలు కొన్ని ‘సాహో’ హిందీలో ఫ్లాప్ అని వాదిస్తున్నాయి. అంతేకాదు ‘సాహో’ ఫలితం చూసి బెదిరిన ప్రభాస్ రాధాకృష్ణ డైరెక్షన్లో చేస్తున్న తన తర్వాతి సినిమా పూర్తిస్థాయి రొమాంటిక్ మూవీ కాబట్టి హిందీలో వర్కవుట్ కావడం కష్టమని భావించి హిందీలో తీయాలనే ఆలోచనను పక్కనబెట్టి కేవలం తెలుగులోనే తీసుకుంటున్నారని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేశాయి.

కానీ చిత్ర సన్నిహిత వర్గాలు మాత్రం ప్రభాస్ నెక్స్ట్ మూవీ బహుభాషా చిత్రమని, హిందీలో కూడా రూపొందుతుందని, ఇంకొద్దిరోజుల్లో రెగ్యులర్ షూట్ మొదలవుతుందని గట్టిగా స్పష్టం చేశాయి. హిందీ ఆడియన్స్ సైతం ‘సాహో’ హిందీ వెర్షన్ ఫ్లాప్ అనడాన్ని ఖండించారు. మరి ఇప్పటికైనా సదరు వార్తా ఏజెన్సీలు ప్రభాస్ సినిమా మీద ప్రచురించిన తప్పుడు వార్తల్ని వెనక్కి తీసుకుంటారేమో చూడాలి.

Exit mobile version