డబుల్ లుక్స్ లో ప్రభాస్ ఫుల్ యాక్షన్ ?

డబుల్ లుక్స్ లో ప్రభాస్ ఫుల్ యాక్షన్ ?

Published on May 23, 2020 11:39 PM IST

రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో నేషనల్ స్టార్ ప్రభాస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పీరియాడిక్‌ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో ప్రభాస్ రెండు గెటప్స్ లో కనిపిస్తారని.. పిరియాడిక్ నేపథ్యంలో వచ్చే ఓల్డ్ గెటప్ లో.. అదేవిదంగా ప్రస్తుత కాలానికి సంబంధించి మరో గెటప్ లో ప్రభాస్ కనిపిస్తాడని తెలుస్తోంది. అయితే డబుల్ లుక్స్ లో ప్రభాస్ ఫుల్ యాక్షన్ చేయనున్నాడట. ఇక రివేంజ్ స్టోరీతో సాగే ఓ థ్రిల్లింగ్ ప్రేమకథే ఈ చిత్రం అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది.

కాగా గోపి కృష్ణ మూవీస్ బ్యానర్ పై కృష్ణంరాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా రూపొందించి ఇతర భాషల్లోకి అనువదించనున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తోంది. ఈ చిత్రంలో యాక్షన్ మాత్రమే కాకుండా మంచి రొమాంటిక్ కంటెంట్ కూడా ఉండనుంది. ఈ చిత్రానికి ‘జాన్’ అనే పేరుతో పాటు ‘ఓ డియర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు