ఈరోజు నాకు చాలా స్పెషల్ : ప్రభాస్

ఈరోజు నాకు చాలా స్పెషల్ : ప్రభాస్

Published on Apr 28, 2018 3:27 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘బాహుబలి-2’ గత ఏడాది ఇదే రోజు ఏప్రిల్ 28న విడుదలై బ్రహ్మాండమైన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో ప్రభాస్ జాతీయ స్థాయి హీరోగా ఎదగడమేగాక ఆయన మార్కెట్ స్థాయి కూడ అమాంతం పెరిగింది. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు ప్రతిమను కూడ ఏర్పాటు చేశారు.

ఇంతటి కీర్తిని అందించిన బాహుబలి-2 చిత్రం విడుదలైన ఈరోజు తనకు ఎప్పటికీ చాలా స్పెషల్ అని ప్రభాస్ అన్నారు. అంతేగాక తనపై, తన సినిమాపై ఇంతటి ప్రేమను చూపించి, ఈ జర్నీలో భాగమైన అభిమానుల పట్ల తన ప్రేమను వ్యక్తపరిచిన ప్రభాస్ రాజమౌళి అండ్ టీమ్ కు కృతఙ్ఞతల్ని తెలియజేశారు. ప్రస్తుతం ‘సాహో’ చిత్రీకరణలో ఉన్న ఆయన త్వరలో మరో కొత్త సినిమాను మొదలుపెట్టబోతున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు