రెబెల్ స్టార్ మరియు స్టైలిష్ స్టార్ ఒకే వేడుకలో

రెబెల్ స్టార్ మరియు స్టైలిష్ స్టార్ ఒకే వేడుకలో

Published on Sep 14, 2019 9:37 AM IST

రెబెల్ స్టార్ ప్రభాస్ మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గోపీచంద్ చిన్న కొడుకు వియాన్ మొదటి పుట్టిన రోజు వేడుకకు హాజరై సందడి చేశారు. హైదరాబాద్ లోని గోపి చంద్ నివాసంలో గత రాత్రి జరిగిన ఈ వేడుకలో ఇద్దరు టాప్ స్టార్స్ రావడంతో అక్కడి వాతారణం సందడిగా మారింది. గోపీచంద్ కి అల్లు అర్జున్, ప్రభాస్ మంచి మిత్రులు కావడంతో వీరిద్దరూ వియాన్ జన్మదిన వేడుకకు విచ్చేసి ఆశీర్వదించడంతో పాటు, శుభాకాంక్షలు తెలిపారు. ఇక గోపీచంద్ 2013లో హీరో శ్రీకాంత్ మేనకోడలు రేష్మాను వివాహం చేసుకోగా వారికి ఇద్దరు సంతానం. మొదటి కొడుకు పేరు విక్రమ్ కృష్ణ కాగా చిన్న కుమారుడు వియాన్.

కాగా గోపీచంద్ తాజా చిత్రం చాణక్య వచ్చే నెలలో దసరా కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తుండగా, దర్శకుడు తిరు యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నాడు. మెహ్రీన్ గోపి చంద్ కి జంటగా నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు