ప్రభాస్ నీల్ రెండో స్క్రిప్ట్ కోసం కూడా విన్నాడా.?

Published on Mar 24, 2021 12:00 pm IST

లేటెస్ట్ గా పాన్ ఇండియన్ లెవెల్లో మంచి హైప్ తెచ్చుకున్న సెన్సేషనల్ కాంబోలలో కేజీయఫ్ దర్శకుడు మరియు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ల కాంబో కూడా ఒకటి. మరి ఈ కాంబో నుంచి సెట్టయిన బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” భారీ అంచనాలు సెట్ చేసుకొని శరవేగంగా షూట్ ను జరుపుకుంటుంది. దీనితో పాటుగా మళ్ళీ ఈ కాంబో రిపీట్ అవుతుంది అని సినీ వర్గాల్లో ఇప్పటికే విస్తృత సమాచారం ఊపందుకుంది.

అలాగే నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారని కూడా తెలిసింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ చిత్రం తాలూకా స్క్రిప్ట్ ని కూడా నీల్ ప్రభాస్ కు వినిపించాడని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ముగ్గురుకి ఉన్న కమిట్మెంట్స్ కంప్లీట్ అయ్యాక ఈ సినిమా లైన్ లోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా సూచనలు వినిపిస్తున్నాయి. అలాగే ఆల్ మోస్ట్ ఈ చిత్రం కన్ఫర్మ్ అనే వినిపిస్తుంది. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది..

సంబంధిత సమాచారం :