ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ అప్పుడే లైన్ లోకి వచ్చిందా.?

Published on Apr 6, 2021 3:01 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు భారీ పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాధా కృష్ణ తో చేసిన “రాధే శ్యామ్” ఆల్రెడీ కంప్లీట్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మరి దీని తర్వాత ఇంకో మూడు బిగ్ బడ్జెట్ సినిమాలు పూర్తి అవ్వాల్సి ఉంది.

అయితే ఇంకా ఇవి లైన్ లో ఉండగానే మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో ప్రభాస్ రానున్నాడని గత కొన్ని రోజులుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. అదే కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ తో.. అయితే ఈ సినిమా ఎప్పుడు చర్చలోకి వచ్చింది అన్నది ఇపుడు తెలుస్తుంది.

ఈ సినిమా కోసం ఆ మధ్య లోకేష్ “మాస్టర్” చిత్రం ప్రమోషన్స్ కు వచ్చిన టైం లో కలిసి అనుకున్నారట. అప్పుడు లోకేష్ ప్రభాస్ కు ఓ లైన్ చెప్పగా అందుకు ప్రభాస్ సానుకూలంగానే స్పందించాడట. మరి ఇందులో ఎంత వరకు నిజముందో చూడాలి. మొత్తానికి మాత్రం ఈ సాలిడ్ కాంబోపై కూడా మంచి హైప్ స్టార్ట్ అయ్యింది.

సంబంధిత సమాచారం :