ప్రభాస్ తో పోటీపడనున్న సూర్య !

Published on Mar 19, 2019 8:15 pm IST

తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కాప్పాన్ చిత్రంలో నటిస్తున్నాడు. కెవి ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తుది దశకు చేరుకుంది. ఇక ఇటీవల ఒక మలయాళ ఛానెల్ తో మాట్లాడిన సూర్య ఈ చిత్రంలో మోహన్ లాల్ కు సెక్యూరిటీ ఆఫీసర్ గా నటిస్తున్నాని అన్నారు.అలాగే ఈ చిత్రాన్ని ఆగస్టు 15 న కానీ లేదా దానికి వారం ముందుకు గాని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ చిత్రంలో మోహన్ లాల్ ప్రధాన మంత్రి గా నటిస్తున్నారు.ఇక రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా సాహో కూడా స్వాతంత్య్ర దినోత్సవం రోజునే విడుదలకానుంది.

ఇక ఇదిలా ఉంటే సూర్య నటించిన మచ్ అవైటెడ్ మూవీ యెన్ జి కె విడుదల తేది ఫై ఇంకా క్లారిటీ రావడం లేదు. మే లో ఈచిత్రం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

సంబంధిత సమాచారం :