
‘లౌక్యం’ సినిమా సూపర్ హిట్ అందుకున్న మాచో హీరో గోపీచంద్ అప్పుడే ‘జిల్’ సినిమాతో మరో హిట్ అందుకోవడానికి వచ్చేస్తున్నాడు. దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఇక ప్యాచ్ వర్క్ సీన్స్ మాత్రం మిగిలి ఉన్నాయి. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. సినిమా దాదాపు ఫినిష్ అవ్వడంతో జిబ్రాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియో ని ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. హైదరబాద్ లో గ్రాండ్ గా జరగనున్న ఈ ఆడియో వేడుకకి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నాడు.
‘మిర్చి’, ‘రన్ రాజా రన్’ లాంటి సక్సెస్ఫుల్ సినిమాలను అందించిన యువి క్రియేషన్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాతలు వంశీ – ప్రమోద్ లు ప్రభాస్ కి మంచి ఫ్రెండ్స్ కావడం వలన ఈ ఆడియో వేడుకకి వస్తున్నాడు. ఈ సినిమాని కూడా మార్చి 27న రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం నిర్ణయించుకుంది. రాధాకృష్ణ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన బ్యూటిఫుల్ రాశి ఖన్నా హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమాలో గోపీచంద్ స్లిమ్ అండ్ స్టైలిష్ లుక్ లో కనిపించనున్నాడు.

