యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో ఒక్కసారిగా నేషనల్ స్టార్ అయిపోయాడు. కాగా ప్రస్తుతం ప్రభాస్ సాహో చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ప్రభాస్ త్వరలోనే డైరెక్ట్ గా బాలీవుడ్ లో ఓ చిత్రం చేయబోతున్నారనే వార్తా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.
కాగా కరణ్ జోహర్ బాహుబలి చిత్రానికి బాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చి అక్కడ భారీ స్థాయిలో విడుదల చేశారు, తాజా సినీవర్గాల సమాచారం ప్రకారం ఇప్పుడు ఆయనే మళ్ళీ ప్రభాస్ తో బాలీవుడ్ లో ఓ సినిమా చేయబోతున్నారట. కాకపొతే ఇది మల్టీస్టారర్ అని తెలుస్తోంది. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ మరియు ప్రభాస్ ను పెట్టి కరణ్ జోహర్ ఈ మల్టీస్టారర్ ను ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


