లండన్ లో విలాసవంతమైన ఇల్లును కొనుగోలు చేసిన ప్రభాస్?

లండన్ లో విలాసవంతమైన ఇల్లును కొనుగోలు చేసిన ప్రభాస్?

Published on Mar 27, 2024 5:41 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) వరుస భారీ చిత్రాలు చేస్తూ కెరీర్ లో దూసుకు పోతున్నారు. ప్రస్తుతం కల్కి 2898AD( Kalki 2898AD) చిత్రం తో బిజీగా ఉన్నారు. వీలైన త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకు వచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ లండన్ లో విలాసవంతమైన ఇల్లును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రభాస్ రెగ్యులర్ గా షూటింగ్ నిమిత్తం, హాలిడేస్ కి వెళ్ళినప్పుడు లండన్ లో ఆ ఇంట్లో ఉండేవాడు అని, రెంట్ కి కోట్ల రూపాయల ఖర్చు చేసేవాడని సమాచారం.

అయితే ఆ ఇల్లు తనకి బాగా నచ్చడంతో భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నట్లు టాక్. దీనిపై ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రెబల్ స్టార్ ప్రభాస్ చివరిసారి గా ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కిన సలార్ మూవీ లో హీరోగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. కల్కి చిత్రం తరువాత, ది రాజా సాబ్, సలార్ 2 చిత్రాలను చేయనున్నారు. వీటిపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు