సొనక్షితో స్టెప్పులేసిన టాలీవుడ్ హీమాన్

సొనక్షితో స్టెప్పులేసిన టాలీవుడ్ హీమాన్

Published on Dec 6, 2014 7:48 PM IST

Prabhas-sonakshi-sinha
బాలీవుడ్ హీరోయిన్ సొనక్షి సిన్హా తో టాలీవుడ్ హీమాన్… మన బుజ్జిగాడు ‘ప్రభాస్’ స్టెప్పులేసాడు. ఇండియన్ మైఖెల్ జాక్సన్ ప్రభుదేవా ‘యాక్సన్ జాక్సన్’ లోని ఓ పాటలో ఈ ఏక్ నిరంజన్ తళుక్కుమన్నాడు. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ‘పౌర్ణమి’ సినిమాతో ఏర్పడిన స్నేహమే ఈ ఎంట్రీకి కారణం. సినిమా ఫలితం ఎలా వున్నప్పటికీ మన మిర్చి కుర్రాడు ఈ రకంగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసాడు. మిర్చి సినిమా తర్వాత ప్రభాస్ తెరపైన కనబడనే లేదు. ఈ హీరో ప్రస్తుతం సినిమాల్లో ఓటమి దరిచేరని దర్శకుడు రాజమౌళి ‘బాహుబలి’ లో నటిస్తున్నాడన్నది తెలిసిందే. ఈ సినిమా వచ్చే వేసవికి విడుదల కానుంది. అందులోనూ బాలీవుడ్ సినిమా అంటే దేశమంతా అభిమానులే కాబట్టి తన అభిమానులను ఇలా అలరించాడన్నమాట..!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు