కలవరపెడుతున్న ప్రభాస్ డెడికేషన్.!

Published on Aug 25, 2021 10:05 am IST


పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు భారీ చిత్రాలను చేస్తున్నాడు.. అయితే తన బాహుబలి చిత్రాల నుంచే ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ గా అలాగే డెడికేషన్ కి కూడా కేరాఫ్ అడ్రెస్ గా నిలిచి ఇప్పుడు ఇంత ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. అయితే తన సినిమా రోల్స్ కోసం ఎలా అయినా మారగలిగే ప్రభాస్ ని చూసి ఇండస్ట్రీ వర్గాలు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.

అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ అయితే కాస్త కలవరంలో కూడా ఉన్నారు. ప్రభాస్ అప్పుడు కేవలం ఒక్క సినిమాకే ఐదేళ్లు తనవి కాదు అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఏకకాలంలో రెండు మూడు సినిమాలు ఒకేసారి చేస్తూ వస్తున్నాడు. పైగా అతి తక్కువ సమయంలోనే సినిమాలకు కావలసినట్టు తన దేహాన్ని మార్చుకోవడం లుక్ ని సిద్ధం చెయ్యడం వంటివి నిజంగా తన డెడికేషన్ కే అర్ధం చూపిస్తాయి.

కానీ తాజాగా బయటకి వచ్చిన ప్రభాస్ లుక్స్ చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పటి చార్మ్ తనలోని గ్లో అంతా కూడా ఇప్పుడు మిస్సవ్వడం జెనరల్ మూవీ లవర్స్ కి కూడా ఒక రకంగా బాధ కలిగిస్తుంది. దీనితో మళ్ళీ వింటేజ్ ప్రభాస్ లుక్స్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :