ఇటలీలో అదరగొడుతున్న ప్రభాస్.!

Published on Oct 29, 2020 9:00 am IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “రాధే శ్యామ్”. ఇటీవలే ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్స్ కానీ అలాగే మోషన్ పోస్టర్ టీజర్ కానీ అన్ని వర్గాల ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. అయితే లాక్ డౌన్ వల్ల వచ్చిన సుదీర్ఘ విరామం అనంతరం చిత్ర యూనిట్ ఇటలీలో షూట్ కు పయనమయ్యారు.

అక్కడ నుంచే ఈ అప్డేట్స్ చిత్ర యూనిట్ అందించారు. అయితే ఇదే ఇటలీ నుంచి మాత్రం ప్రభాస్ అదరగొడుతున్నాడనే చెప్పాలి. అక్కడ షూటింగ్ లో ఫొటోస్ మినహాయిస్తే ఆఫ్ స్క్రీన్ ఫొటోస్ ఇప్పుడు కొన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

వాటిలో ప్రభాస్ లుక్స్ మాత్రం చాలా ఫ్రెష్ గా మరియు స్టైలిష్ డ్రెస్సింగ్ లో మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. మరి ఇవే డ్రెస్సింగ్ తో సినిమాలో కూడా కనిపిస్తాడో లేదో కానీ ఈ నయా లుక్స్ లో కనిపించి మాత్రం ప్రభాస్ అదరగొడుతున్నాడు. ఏఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More