ప్రభాస్ ఫ్యాక్టర్ “జాతి రత్నాలు”కి బాగా వర్క్ అయ్యింది.!

ప్రభాస్ ఫ్యాక్టర్ “జాతి రత్నాలు”కి బాగా వర్క్ అయ్యింది.!

Published on Mar 6, 2021 2:00 AM IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పాన్ ఇండియన్ లెవెల్లో అనన్య సామాన్యం. దానిని కనుక సరిగ్గా వినియోగిస్తే ఎలా ఉంటుందో జస్ట్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యంగ్ హీరోలకు ఎంత బూస్టప్ ఇస్తుందో ప్రూవ్ అయ్యింది. అనుదీప్ కేవీ దర్శకత్వంలో టాలెంటెడ్ యువ హీరో నవీన్ పొలిశెట్టి హీరోగా రాహుల్ రామకృష్ణ మరియు ప్రియదర్శిలు మరో కీలక పాత్రల్లో చేసిన చిత్రం “జాతి రత్నాలు”.

లేటెస్ట్ గానే ఈ సినిమా ట్రైలర్ విడుదల కాబడి అసలు ఎవరూ ఊహించని రేంజ్ రెస్పాన్స్ ను రాబట్టుకుంది. మరి దీనికి మాత్రం ఖచ్చితమైన కారణం ప్రభాస్ అనే చెప్పాలి. మొదటి నుంచీ ఈ కామెడీ ఎంటర్టైనర్ పై మంచి బజ్ ఉన్నా దానిని మాత్రం ప్రభాస్ మరో లెవెల్ కు తీసుకెళ్లాడని చెప్పడంలో సందేహం లేదు.

మన టాలీవుడ్ టాప్ మోస్ట్ వ్యూస్ మరియు లైక్స్ కలిగిన టీజర్స్ జాబితాలో ప్రభాస్ చేతులు మీదుగా విడుదల కాబడిన ఈ ట్రైలర్ నిలబడింది అంటేనే అర్ధం చేసుకోవచ్చు ప్రభాస్ ఫ్యాక్టర్ దీనికి ఎంతలా వర్కౌట్ అయ్యింది అన్నది. మొత్తానికి మాత్రం ప్రభాస్ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాణం వహించిన ఈ సినిమా ప్రభాస్ మూలాన ప్రేక్షకుల్లోకి మరింత స్థాయిలో వెళ్ళింది అని చెప్పాలి. మరి ఇదే హవా రేపు సినిమా విడుదల టైం కి ఎలా ఉంటుందో కూడా చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు