ఫౌజీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ..?

ఫౌజీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ..?

Published on Jun 8, 2026 6:04 PM IST

Fauzi

పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు భారీ చిత్రాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాడు. ఆయన తదుపరి రాబోతున్న చిత్రాలలో హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామా ‘ఫౌజీ’ ఒకటి. ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడి పాత్రలో నటిస్తుండగా, ఇమాన్వి హీరోయిన్‌గా పరిచయమవుతోంది. అయితే, షూటింగ్ శరవేగంగా జరుగుతున్నప్పటికీ చిత్ర యూనిట్ నుండి ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో అభిమానుల్లో అయోమయం నెలకొంది.

​ముందుగా ఈ సినిమా దసరా కానుకగా విడుదలవుతుందని ప్రచారం జరిగినప్పటికీ, ఆ సమయానికి ఇతర చిత్రాలు లైన్లో ఉండటంతో రిలీజ్ డేట్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. మేకర్స్ నుండి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్, సోషల్ మీడియా వేదికగా #GiveUsFauziUpdateASAP అనే హాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్‌తో పాటు అప్‌డేట్ ఇవ్వాలంటూ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ను డిమాండ్ చేస్తున్నారు.

​ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా, స్వాతంత్ర్యానికి పూర్వపు రోజులలో జరిగే కథాంశంతో ఇది రూపొందుతోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన మేజర్ షూటింగ్ పార్ట్ పూర్తయినట్లు తెలుస్తోంది. పాన్-ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ అప్‌డేట్ కోసం అభిమానులంతా ప్రస్తుతం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు.

తాజా వార్తలు