Fauzi: ఒక్క పోస్టర్ తో రెబల్ ఫ్యాన్స్ మతులు పోగొట్టేసిన హను రాఘవపూడి!

Fauzi: ఒక్క పోస్టర్ తో రెబల్ ఫ్యాన్స్ మతులు పోగొట్టేసిన హను రాఘవపూడి!

Published on Jul 16, 2026 1:00 PM IST

ఇండియాస్ బిగ్గెస్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న ప్రస్తుత భారీ చిత్రాల్లో దర్శకుడు హను రాఘవపూడి కలయికలో చేస్తున్న అవైటెడ్ చిత్రం “ఫౌజీ” కూడా ఒకటి. అజ్ఞాత పర్వం అంటూ ఒక పవర్ఫుల్ బెటాలియన్ కలిపి ఒక్కడే అయితే ఎలా ఉంటుందో అంత పవర్ఫుల్ పాత్రలో ప్రభాస్ ని తాను ప్రెజెంట్ చేస్తున్నారు.

ఇది వరకు సినిమా నుంచి ప్రభాస్ లుక్ కి సంబంధించి ఎలాంటి క్లారిటీ రాలేదు కానీ లేటెస్ట్ గా విడుదల చేసిన ఫస్ట్ లుక్ అండ్ రిలీజ్ డేట్ పోస్టర్ చూసి ప్రభాస్ ఫ్యాన్స్ కి మతులు పోయాయి. అసలు సీతా రామం లాంటి క్లాస్ అండ్ బ్యూటిఫుల్ సినిమాని తీసిన హను రాఘవపూడియేనా ఈ రేంజ్ లో ప్రెజెంట్ చేసింది అన్నట్టు షాక్ లో ఉన్నారు అభిమానులు.

పైగా ప్రభాస్ ని షర్ట్ లేకుండా చూపించడం ఒకెత్తు అయితే అతడు జంధ్యం వేసుకొని కనిపించడంతో ప్రభాస్ ఒక నెవర్ బిఫోర్ పాత్రని చేస్తున్నట్టుగా ఫ్యాన్స్ కి ఇపుడు ఓ క్లారిటీ వచ్చేసింది. ఇలా సోషల్ మీడియాని సినీ వర్గాలని హను రాఘవపూడి విజన్ ఇప్పుడు షేక్ చేస్తుంది. ఇక ఫుల్ ఫ్లెడ్జ్ సినిమాలో ప్రభాస్ రోల్ ఎలాంటి ట్రీట్ ఇస్తుందో తెలియాలి అంటే ఈ డిసెంబర్ 3 వరకు ఆగాల్సిందే.

తాజా వార్తలు