“రాధే శ్యామ్” విషయంలో బాగా డిజప్పాయింట్ గా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్.!

Published on Jan 14, 2021 9:44 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “రాధే శ్యామ్”. ఒక బ్యూటిఫుల్ పీరియాడిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని మేకర్స్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మరి అలాగే ఈ భారీ చిత్రం నుంచి టీజర్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. కానీ మేకర్స్ మాత్రం మాత్రం ఎప్పటి లానే చెప్పుకోదగ్గ అప్డేట్స్ ఇవ్వడం లేదు.

ఆ మధ్య అంటే పోస్టర్స్ మరియు పోస్ట్ లతో పర్లేదు అనిపించారు కానీ మోస్ట్ అవైటెడ్ టీజర్ విషయంలో మాత్రం ఇంకా మౌనంగా ఉండడంతో సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. ఈ పండుగపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు కానీ మేకర్స్ మాత్రం ఎలాంటి అప్డేట్ ను ఇవ్వలేదు. దీనితో అంతా బాగా డీలా పడిపోయారు. మరి మేకర్స్ నుంచి ఎప్పుడు అప్డేట్ వస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా యూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :

More