
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “రాధే శ్యామ్”. మంచి అందమైన పెయింటింగ్ లా తెరకెక్కించిన ఈ చిత్రం కోసం రెబల్స్ ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో విక్రమ్ ఆదిత్య గా ప్రభాస్ లవర్ బాయ్ రోల్ లో కనిపిస్తున్నాడు.
ఈ రోల్ కోసం మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. అందుకే ప్రస్తుతం అయితే టీజర్ కోసమే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ కొత్త లుక్స్ మరియు మ్యానరిజం డ్రెస్సింగ్ ఇలా అన్నిటి విజువల్ ట్రీట్ కోసం వారు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ టీజర్ ఈ వాలెంటైన్స్ డే స్పెషల్ గా వస్తుంది అని గట్టి బజ్ వినిపిస్తుంది.
మరి ఆ స్పెషల్ డే రోజున వీరి మ్యాజికల్ లవ్ స్టోరీ టీజర్ వస్తుందో లేదో చూడాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక ఈ భారీ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఈ టీజర్ కోసమే సోషల్ మీడియాలో హంగామా నడుస్తుంది.