బ్రేక్ తీసుకున్న ప్రభాస్.. ఇటలీలో వెకేషన్‌కు టేకాఫ్..!

Prabhas

పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ వరుస షూటింగ్‌ల ఒత్తిడి నుండి చిన్న విరామం తీసుకున్నాడు. ఈ ఏడాది విడుదలైన ‘రాజా సాబ్’ ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో, ఆయన తన నెక్స్ట్ చిత్రాలపై పూర్తి దృష్టి పెట్టాడు. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’, అలాగే సందీప్ రెడ్డి వంగా సినిమా ‘స్పిరిట్’ షూటింగ్‌లతో ఆయన ఎంతో బిజీగా ఉన్నాడు.

నిర్విరామంగా షూటింగ్స్‌లో ఉన్న ప్రభాస్, రీఛార్జ్ అవ్వడం కోసం తాజాగా బేగంపేట విమానాశ్రయం నుండి ఇటలీకి వెకేషన్‌కు బయలుదేరాడు. వేసవి సెలవుల కోసం వెళ్తున్న ఆయన, కొద్ది రోజులు అక్కడే గడిపి త్వరలోనే హైదరాబాద్‌కు తిరిగి రానున్నాడు. విరామం తర్వాత ఆయన ‘కల్కి 2898 AD’ సీక్వెల్ షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది.

ప్రభాస్ నటించిన ‘ఫౌజీ’ ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశం ఉండగా, భారీ అంచనాలున్న ‘స్పిరిట్’ చిత్రం మార్చి 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కల్కి సీక్వెల్ షూటింగ్ అప్పుడే మొదలైనప్పటికీ, దాని విడుదల తేదీపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ చిన్న విరామం తర్వాత ప్రభాస్ మళ్ళీ వరుస సినిమాలతో బిజీ కానున్నాడు.

Exit mobile version