
సుమారు రెండున్నరేళ్ళ పాటు తన కాల్షీట్స్ మొత్తం ఒకే సినిమాకి ఇచ్చి, ఆ సినిమా కోసమే అహర్నిశలు పనిచేసిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బాహుబలి సూపర్ సక్సెస్ తో చాలా హ్యాపీ గా ఉన్నాడు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ విజువల్ వండర్ అన్ని చోట్లా రికార్డ్స్ ని బద్దలు కొడుతోంది. ప్రభాస్ ఈ సినిమాలో బాహుబలి మరియు శివుడు అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించి అందరినీ మెప్పిస్తున్నాడు. ఇప్పటి వరకూ తెలుగులోనే ఆదరించిన ప్రభాస్ కి ఇప్పుడు అన్ని భాషల్లో మంచి ఆదరణ లభించింది. అంతే కాకుండా ఎంతో మంది సెలబ్రిటీలు ప్రభాస్ పర్సనల్ గా, సోషల్ మీడియా ద్వారా స్పెషల్ విషెస్ కూడా తెలిపారు.
ఇంతమంది విషెస్ లో ప్రభాస్ ని ఎంతో థ్రిల్ చేసి తను ఏమి వింటున్నాడో కూడా మర్చిపోయేలా చేసింది మాత్రం సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ గారి ఫోన్ కాల్ అని ప్రభాస్ అంటున్నాడు. ‘కరణ్ జోహార్ ఫోన్ చేసి మెచ్చుకుంటే, రన్బీర్ కపూర్ మేసే చేసి మెచ్చుకున్నాడు. కానీ వీరందరి కంటే రజినీకాంత్ నుంచి వచ్చిన కాల్ మాత్రం నా మతి పోగొట్టింది. రజినీకాంత్ ఎప్పుడు కాల్ చేసింది, మర్చిపోయా, ఆయన చెప్పిన దాన్లో సగం నేను వినలేదు కూడా ఆ తర్వాత తేరుకొని ఆయన చెప్పింది విని, నా తరపున స్పెషల్ థాంక్స్ చెప్పానని’ ప్రభాస్ తెలిపాడు. ప్రస్తుతం ప్రభాస్ హాలిడే కోసం విదేశాలకు వెళ్ళాడు. రాగానే బాహుబలి 2 కి సంబందించిన వర్క్ మొదలు పెడతాడు. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.