ప్రభాస్ కు బర్త్ డే విషస్ తెలియజేస్తున్న సెలబ్రెటీలు !

ప్రభాస్ కు బర్త్ డే విషస్ తెలియజేస్తున్న సెలబ్రెటీలు !

Published on Oct 23, 2018 10:54 AM IST

ఈరోజు తన 39వ పుట్టిన రోజు జరుపుకుంటున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు సామజిక మాధ్యమాల్లో పెద్ద సంఖ్యలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. పలువురుసెలబ్రెటీలు ట్విటర్ వేదికగా తమ విషస్ ను తెలియయజేస్తున్నారు.

వెంకటేష్, జగపతి బాబు , కొరటాల శివ , హరీష్ శంకర్ , రకుల్ ప్రీత్ సింగ్ , మురళి శర్మ , వెన్నెల కిశోర్ , రానా దగ్గుబాటి తదితరులు ప్రభాస్ కు ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇక మరి కొద్దీ సేపట్లో ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ చిత్రం నుండి మేకింగ్ వీడియో విడుదల కానుంది. ఇక ప్రభాస్ ఈచిత్రంతో పాటు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న తన 20వ చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఈరెండు చిత్రాలు వచ్చే ఏడాదిలో విడుదలకానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు