ప్రేరణ పెర్ఫార్మెన్స్ చూసి ప్రభాస్ ఇంప్రెస్ అయిపోయాడట

Published on May 29, 2021 2:00 am IST

దక్షిణాది స్టార్ హీరోయిన్లలో పూజా హెగ్డే కూడ ఒకరు. ‘డీజే, మాహర్షి, అల వైకుంఠపురములో’ లాంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్లతో స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకుంది. ప్రజెంట్ ఆమె పలువురు బడా హీరోల సినిమాలు చేస్తోంది. వాటిలో ఒకటి ప్రభాస్ నటిస్తున్న ‘రాధే శ్యామ్’ చిత్రం. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఉండనుంది. దాదాపు మేజర్ షూటింగ్ మొత్తం పూర్తికాగా కాస్త చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. లాక్ డౌన్ ముగిశాక దాన్ని ఫినిష్ చేయనున్నారు టీమ్. ఇటీవలే ప్రభాస్ షూటింగ్ రషెస్ చూసి చాలా సంతృప్తి చెందారట.

ముఖ్యంగా పూజా హెగ్డే పెర్ఫార్మెన్స్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యారట. ప్రేరణ పాత్రలో ఆమె నటన, స్క్రీన్ ప్రెజెన్స్, రొమాంటిక్ సన్నివేశాలను పండించిన విధానం నచ్చి ఆమె మీద ప్రశంసలు కురిపిస్తున్నాడట రెబల్ స్టార్. కరోనా సెకండ్ వేవ్ రీత్యా అనేక సినిమాలు వాయిదాపడినా ఈ చిత్రం మాత్రం ముందుగా ప్రకటించిన జూలై 30వ తేదీకే ఫిక్స్ అయి ఉంది. అనుకున్నట్టే త్వరలో లాక్ డౌన్ ముగిసి షూటింగ్ పూర్తై, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయి థియేటర్లు మునుపటిలా తెరుచుకుంటే అదే తేదీకి చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు టీమ్.

సంబంధిత సమాచారం :