ప్రభాస్ లోని మరో క్వాలిటీని బయటపెట్టిన శ్రద్దా కపూర్ !

ప్రభాస్ లోని మరో క్వాలిటీని బయటపెట్టిన శ్రద్దా కపూర్ !

Published on Apr 30, 2018 9:25 AM IST

ప్రభాస్ చేస్తున్న ‘సాహో’ చిత్రంలో బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్ కథానాయకిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ తో వర్క్ చేయడం చాలా మంచి అనుభవమని పలు సందర్బాల్లో చెప్పిన శ్రద్దా తాజాగా ప్రభాస్ ఎప్పుడూ సరదగా ఉంటారని, స్టార్ డమ్ తో పని లేకుండా సాధారణంగా ఉంటారని, అంతేగాక ప్రభాస్ ఎప్పుడూ అందరికి అందుబాటులోనే ఉంటారని, ఆయన్ను చేరుకోవడం చాలా సులభమని, ఆయనలోని ఆ క్వాలిటీ తనను బాగా ఇంప్రెస్ చేసిందని అన్నారు.

ఇకపోతే శ్రద్దా కపూర్ కూడ త్వరలోనే దుబాయ్ లో జరుగుతున్న షెడ్యూల్లో జాయిన్ కానున్నారు. నీల్ నితిన్ ముఖేష్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో మందిరా బేడీ, టిన్ను ఆనంద్, ఎవెలిన్ శర్మ వంటి వారు నటిస్తున్నారు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు