ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ లో చేరడమే ఆలస్యం ..!

Published on Apr 12, 2019 8:15 pm IST

రెబల్ స్టార్ ప్రభాస్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాహుబలి తరువాత దేశ వ్యాప్తంగా అభిమానులు ను సంపాందించుకున్నాడు. ఇక సోషల్ మీడియాలో ప్రభాస్ పెద్దగా ఆక్టివ్ గాఉండడు. కానీ ఆయన పేస్ బుక్ అకౌంట్ కు కోటి కి పైగా ఫాలోవర్లు వున్నారు.

తాజాగా ప్రభాస్ నిన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను ఓపెన్ చేశాడు . అయితే ఇంకా ఒక్క పోస్ట్ కూడా చేయకుండానే ఇప్పటికే 6లక్షల మందికి పైగా ప్రభాస్ ను ఫాలో అవుతున్నారు.

ఇక ప్రభాస్ రెండు సినిమాలతో బిజీ గా వున్నాడు. అందులో ఒకటి సాహో కాగా మరొకటి జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్ లో తన 20వచిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో సాహో ఆగస్టు 15న విడుదలకానుండగా ప్రభాస్ 20 వచ్చే ఏడాది లో ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :