టార్గెట్ కొట్టేసిన “కల్కి 2898 ఎడి”?

టార్గెట్ కొట్టేసిన “కల్కి 2898 ఎడి”?

Published on Jul 6, 2024 7:02 AM IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన లాస్ట్ భారీ చిత్రమే “కల్కి 2898 ఎడి” మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సెన్సేషనల్ మల్టీ స్టారర్ క్రేజీ వసూళ్లతో వరల్డ్ వైడ్ గా దంచికొట్టింది. అయితే ఈ సినిమా భారీ స్థాయిలోనే బిజినెస్ ని జరుపుకోగా ఇప్పుడు సినిమా ఈ బిజినెస్ టార్గెట్ ని థియేట్రికల్ గా కొట్టేసినట్టుగా వినిపిస్తుంది.

దీనితో కల్కి దెబ్బకి ఇక నుంచి లాభాలే రానున్నట్టుగా సినీ వర్గాల్లో టాక్. రిలీజ్ అయ్యిన రోజు నుంచి వర్కింగ్ డేస్ లో కూడా కల్కి పెద్దగా భారీ డ్రాప్ లని ఎక్కడా నమోదు చెయ్యలేదు. స్టడీ రెస్పాన్స్ తో దూసుకెళ్లడమే కాకుండా ఇప్పుడు మరో వీకెండ్ లో కూడా సెన్సేషనల్ బుకింగ్స్ ని ఈ చిత్రం అందుకుంది. ఇలా ఈ చిత్రం ఇప్పుడు పెట్టుకున్న టార్గెట్ ని రీచ్ అయ్యిపోయింది అని వినిపిస్తుంది. ఇక ఈ భారీ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు