తాజాగా తన పెళ్లి గురించి స్పందించిన ప్రభాస్ !

తాజాగా తన పెళ్లి గురించి స్పందించిన ప్రభాస్ !

Published on Jun 19, 2018 9:44 AM IST

గత కొన్ని సంవత్సరాలుగా ప్రభాస్ పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ అనుష్కను పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త నేషనల్ మీడియాలో కూడా హల్‌చల్ చేసింది. ఓ సందర్భంలో అనుష్క, ప్రభాస్ తో తన పెళ్లి పై వస్తున్న రూమర్స్ గురించి స్పందిస్తూ.. ప్రభాస్ నాకు మంచి ఫ్రెండ్ మాత్రమేనని అంతకు మించి మా మధ్య ఇంకేమి లేదని క్లారిటీ ఇచ్చారు.

ఇటీవల ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు, ప్రభాస్ పెళ్లి గురించి ప్రస్తావించడంతో ఈ సంవత్సరం ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త వైరల్ అయింది. దాంతో తన పెళ్లి గురించి వస్తున్న రూమర్స్ పై ప్రభాస్ స్పందిస్తూ.. పెళ్లి నా వ్యక్తిగత విషయం. నాకు ఎంగేజ్‌మెంట్ జరిగిందని రాస్తున్నారు. నిజంగా జరిగితే దానిలో దాచేంత అవసరం ఏముంది. నేను పెళ్లి చేసుకోబోయే ముందు తప్పకుండా నా ఫ్యాన్స్‌ కు, మీడియాకు తెలియజేస్తానని అన్నారు. ప్రస్తుతం ప్రభాస్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సాహో’ చిత్రంలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు