కొనసాగుతున్న ప్రభాస్ సునామి..!

Published on Aug 12, 2020 3:07 pm IST

డార్లింగ్ హీరో ప్రభాస్ క్రేజ్ ఇప్పుడు అనితర సాధ్యం. పాన్ ఇండియన్ క్రేజ్ వచ్చిన తర్వాత ప్రభాస్ పేరు వల్లనే దేనికైనా క్రేజ్ వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. అలా ఇప్పుడు ప్రభాస్ రెండు భారీ పాన్ ఇండియన్ చిత్రాల్లో బిజీగా ఉండగా సోషల్ మీడియాలో మాత్రం ప్రభాస్ సునామి అలా కొనసాగుతూనే ఉంది. కేవలం గత కొన్ని రోజులలోనే మిలియన్స్ కొద్దీ ఫాలోవర్స్ ను పేస్ బుక్ లో సొంతం చేసుకున్నారు.

అలా 16 మిలియన్ మార్క్ నుంచి ఇప్పటికి 19 మిలియన్ మార్క్ ను ఇటీవలే అందుకొని ఇప్పుడు 20 మిలియన్ మార్క్ వైపుగా దూసుకెళ్ళిపోతున్నారు. ఇదంతా కేవలం రెండు నెలల వ్యవధి కంటే తక్కువ సమయంలోనే జరిగిపోయింది. దీనిని బట్టి ప్రభాస్ సునామి ఏ రేంజ్ లో ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న “రాధే శ్యామ్” చిత్రం షూటింగ్ మళ్ళీ పునరావృతం చేసేందుకు వారి టీం ఒక సరికొత్త డేట్ ను పరిశీలిస్తుంది.

సంబంధిత సమాచారం :

More