అల్లూరి, సైరా ,సాహో ఒకే ప్రేమ్ లో…!

Published on Aug 20, 2019 4:56 pm IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ సైరా నరసింహారెడ్డి. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తుడంగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. రాయలసీమకు చెందిన మొదటితరం స్వతంత్రయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుంది. కాగా నేడు ఈ చిత్ర టీజర్ ని విడుదల చేయడం జరిగింది.

ఐతే ఈ చిత్ర టీజర్ విడుదల కోసం ముంబై వెళ్లిన చిరంజీవి, రామ్ చరణ్ లను ప్రభాస్ కలవడం జరిగింది. సాహో ప్రచారంలో బిజీగా ఉంటున్న ప్రభాస్ కూడా ముంబైలోనే ఎక్కువగా గడుపుతున్నారు. ఈ సంధర్భంగా ముంబైలో ప్రభాస్ వీరిద్దరిని కలవడం జరిగింది.వీరు ముగ్గురూ కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మాధ్యమాలలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఆ ఫోటో చుస్తే అల్లూరి సీతారామరాజు, సైరా నరసింహా రెడ్డి, సాహో ని ఒకే ప్రేములో చూసిన భావన కలగకమానదు.

రామ్ చరణ్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో అల్లూరి పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. మూడు భారీ చిత్రాలలో నటిస్తున్న సూపర్ స్టార్స్ ఒకే ఫొటోలో కనిపించి వారివారి ఫ్యాన్స్ ని అలరించారు.

సంబంధిత సమాచారం :