ప్రభాస్ ఈ సినిమా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్.?

Published on Mar 25, 2021 12:00 pm IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఎలాంటి లైనప్ తోఉన్నాడో అందరికీ తెలిసిందే. “రాధే శ్యామ్” నుంచి “ఆదిపురుష్” వరకు ఒక దానిని మించి మరొకటి భారీ అంచనాలు సెట్ చేసుకున్నాయి. అయితే వీటితో పాటుగా టైటిల్ ఇంకా ఖరారు కానీ చిత్రం టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తో కూడా ఉంది.

ఇక ఇక్కడి వరకు ఒక సినిమాతో ఇంకొకటి సంబంధం లేకుండా ఇంట్రెస్టింగ్ జానర్స్ ను ఎంచుకొని ప్రభాస్ హాట్ టాపిక్ అయ్యాడు. మరి వీటిలో నాగ్ అశ్విన్ తో ప్లాన్ చేస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రంపై లేటెస్ట్ గాసిప్ ఒకటి బయటకు వచ్చింది. మరి దీని ప్రకారం ఈ చిత్రం ఒక్క పాన్ ఇండియన్ లెవెల్లో కాకుండా పాన్ వరల్డ్ లెవెల్లో విడుదల చేసే యోచనలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తుంది.

అందుకే ఇండియాలోని అన్ని ప్రధాన భాషలతో పాటుగా ఇంగ్లీష్ లో కూడా విడుదల చేస్తారట. దీపికా పదుకొనె, అమితాబ్ లాంటి భారీ తారాగణంతో ప్లాన్ చేసిన ఈ చిత్రంకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా అశ్వనీ దత్ 500 కోట్లకు పైగా భారీ వ్యయంతో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :