రెండు భారీ సినిమాలకు నిర్విరామంగా ప్రభాస్.!

Published on Apr 10, 2021 7:22 pm IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు ఏకాలంలోనే రెండు భారీ సబ్జెక్టులను చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటగా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్లాన్ చేసిన బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” చేస్తుండగా దీని తర్వాత బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తో భారీ ఇతిహాస చిత్రం “ఆదిపురుష్” చేస్తున్నాడు.

అయితే ఈ రెండు సినిమాల పట్ల ప్రభాస్ కమిట్మెంట్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. మొదటగా సలార్ షూట్ ను డిఫరెంట్ లుక్ తో స్టార్ట్ చేసి పెద్దగా గ్యాప్ లేకుండానే ఆదిపురుష్ లో జాయిన్ అయ్యిపోయాడు. పైగా ఇది బైలాంగువల్ సినిమా కావడంతో ఒకే సీన్ రెండు సార్లు చెయ్యాల్సి వస్తుంది.

మరి ఇలా ఇప్పుడు ఆదిపురుష్ షూట్ లో ప్రభాస్ 40 రోజులకు పైగా పాల్గొంటూ ఈ వచ్చే 14 వరకు షూట్ లోనే ఉండనున్నట్టు తెలుస్తుంది. ఇది పూర్తి అయినా వెంటనే మూడో వారం మొదలు అవుతుంది అక్కడ నుంచి మళ్ళీ ప్రభాస్ గుజరాత్ తో సలార్ రెండో షెడ్యూల్ షూట్ లో పాల్గొననున్నాడు. ఇలా ప్రభాస్ ఈ రెండు సినిమాలకు కూడా నాన్ స్టాప్ షూట్ లో పాల్గొననున్నాడు.

సంబంధిత సమాచారం :