రేపు ఫ్యాన్స్ కు పెద్ద సర్ప్రైజ్ ఇవ్వనున్న ప్రభాస్

Published on May 20, 2019 1:51 pm IST

డార్లింగ్ ప్రభాస్ తాజా మూవీ “సాహో” యూ వి క్రియేషన్స్ బ్యానర్ పై డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్ తో వివిధ భాషలలో నిర్మిస్తున్న ఈ మూవీపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. ఐతే రేపు ప్రభాస్ తన ఫ్యాన్స్ కి ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వనున్నాడంట. ఈ విషయాన్ని ప్రభాస్ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ వీడియో పోస్ట్ చేసి తెలియజేసారు.

ఇప్పటివరకు “సాహో” టీం ప్రభాస్ లుక్స్, మూవీ మేకింగ్ వీడియోస్ మాత్రమే విడుదల చేశారు. ఒక్కటంటే ఒక్కటి కూడా ఆఫీషియల్ టీజర్ కానీ ట్రైలర్ కానీ విడుదల చేయలేదు.కావున రేపు ప్రభాస్ తన “సాహో” మూవీ టీజర్ ని విడుదల చేస్తారోమో చూడాలి మరి.మరింకెందు ఆలస్యం రేపు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి ప్రభాస్ ఇవ్వబోతున్న ఆ సర్ప్రైజ్ కోసం కాచుకొని వుండండి. ప్రభాస్ కి జోడిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ నటిస్తున్న ఈ మూవీని ని 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More