ప్రభాస్ మాటలతో క్రేజ్ ఇంకాస్త పెరిగింది

Prabhas 1

కీరవాణి కుమారుడు శ్రీసింహ హీరోగా నటించిన చిత్రం ‘తెల్లవారితే గురువారం’. మణికాంత్ గెల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రేవు 27వ తేదీన విడుదలకానుంది. మొదటి సినిమా ‘మత్తువదలరా’తో మెప్పించిన శ్రీసింహ ఈ సినిమా మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు. సినిమా ప్రీరిలీజ్ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి ముఖ్య అతిథులుగా రావడంతో సినిమా మీద హైప్ క్రియేట్ అయింది. ట్రైలర్ ఆకట్టుకోవడంతో బుకింగ్స్ పెరిగాయి.

ఇక తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీసింహకు విషెస్ చెబుతూ ‘నా బ్రదర్ శ్రీసింహ నటించిన తెల్లవారితే గురువారం రేపు విడుదలవుతోంది. చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాను. సినిమా కోసం ఎదురుచూస్తున్నాను’ అన్నారు. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ చిన్న సినిమా గురించి ఇలా పోస్ట్ పెట్టడంతో క్రేజ్ మరింత పెరిగింది. గతంలో కూడ ప్రభాస్ ‘మత్తువదలరా’ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన మూలంగానే ఆ సినిమాకు మంచి ఓపెనింగ్స్ దక్కాయి. ఈసారి కూడ ఎన్టీఆర్, ప్రభాస్, రాజమౌళి మూలంగా సినిమాకు మంచి బజ్ ఏర్పడింది.

My brother Simha’s #ThellavaritheGuruvaram is releasing on 27th March. I am excited and can't wait for the release.

Best wishes to the entire team.

Posted by Prabhas on Thursday, 25 March 2021

Exit mobile version