కొత్తగా ట్రై చేయడంలో స్వీటి ముందుంటుందన్న ప్రభాస్ !

లేడీ సూపర్ స్టార్ అనుష్క నటించితిన్ తాజా చిత్ర్రం ‘భాగమతి’ టీజర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. 27 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ సినిమాపై ఆసక్తిని ఇంకాస్త పెంచింది. ముఖ్యంగా అనుష్క పాటర్ పై ఎక్కడా లేని క్యూరియాసిటీ క్రియేట్ అవుతోంది. టీజర్ చూసిన చాలా మంది ప్రేక్షకులు, సెలబ్రిటీలు అనుష్కను ఆకాశానికెత్తేస్తున్నారు.

అలాంటి వారిలో స్వీటీ స్నేహితుడు, రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఉన్నారు. టీజర్ పై స్పందించిన ఆయన కొత్తగా ట్రై చేయడంలో స్వీటీ ఎప్పుడూ ముందే ఉంటుందన్న ఆయన సినిమా సక్సెస్ అవ్వాలని ఆమెకు, నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ కు శుభాకాంక్షలు తెలిపారు. ‘పిల్ల జమిందార్’ ఫేమ్ అశోక్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో జనవరి 26న రిలీజ్ కానుంది.

టీజర్ కొరకు క్లిక్ చేయండి: