ఫ్యాన్స్ కి రంజాన్ గిఫ్ట్ రెడీ చేసిన ప్రభాస్…!

Published on Jun 1, 2019 3:00 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం “సాహో”. ఆగస్ట్ 15న ఈ చిత్రం విడుదల కానుండగా, ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటీవల రెండు పోస్టర్స్ విడుదల చేసిన టీం రంజాన్ సందర్భంగా జూన్‌ 5న “సాహో” కొత్త టీజర్‌ని విడుదల చేయనున్నట్టు సమాచారం. ఇప్పటివరకు చిత్ర యూనిట్ పూర్తి స్థాయి టీజర్ ని విడుదల చేయలేదు. కొన్ని మేకింగ్ వీడియోస్ విడుదల చేయగా వాటికి మంచి ఆదరణ లభించినది.

ఈ చిత్రంలో నీల్ నితిన్ ముఖేశ్, వెన్నెల కిశోర్ , మురళీ శర్మ, జాకీష్రాఫ్, మందిరా బేడీ, అరుణ్ విజయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. రన్ రాజా రన్‌ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇవ్లిన్‌ శర్మ కీలక పాత్రలో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ సుమారు రూ.300 కోట్లతో భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. తెలుగు,హిందీ, తమిళ బాషలలో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :

More