వేరే లెవెల్లో ప్రభాస్ డెడికేషన్..!

వేరే లెవెల్లో ప్రభాస్ డెడికేషన్..!

Published on Feb 21, 2021 8:39 PM IST

prabhas
మన టాలీవుడ్ లో డెడికేషన్ కు కేరాఫ్ అడ్రెస్ ఇప్పుడు ఒక ముద్రలా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరు పడిపోయింది. బాహుబలి కి ఎప్పుడైతే ఐదేళ్లు వదిలేసుకున్నాడో దానికి బదులుగా జీవిత కాలం పాన్ ఇండియన్ స్టార్డం దక్కింది. దీనితో దానిని సుస్థిరంగా అద్భుతమైన ప్రాజెక్ట్ లు చేస్తూ ఇండియా లోనే మోస్ట్ వాంటెడ్ హీరోగా నిలిచాడు. అయితే ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ డెడికేషన్ కోసం హాట్ టాపిక్ అవుతుంది.

అప్పుడు ఒక్క సినిమాకే ఎక్కువ కాలం వెచ్చిస్తే ఇప్పుడు తక్కువ కాలంలో ఎక్కువ సినిమాలు చేస్తూ పైగా తన శరీరాకృతిలో మరియు తన ఫేసియల్ లుక్స్ కూడా చేంజ్ చెయ్యడం ఆసక్తిగా మారింది. జస్ట్ కొన్ని రోజుల కితమే “సలార్” కోసం ప్రిపేర్ అయ్యిన లుక్స్ బయటకు రాగా ఇప్పుడు “ఆదిపురుష్” లుక్ బయటకు వచ్చింది.

అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ట్రిమ్డ్ గడ్డం కోర మీసం లుక్ తో కనిపిస్తూ వచ్చిన ఈ లుక్ వైరల్ అవుతుంది. దీనితో దర్శకుడు ఆదిపురుష్ దర్శకుడు ఓంరౌత్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని ప్రభాస్ అభిమానులు మరిన్ని అంచనాలు ఏర్పరచుకున్నారు.మొత్తానికి మాత్రం ప్రభాస్ డెడికేషన్ రాధే శ్యామ్ నుంచి ఇప్పటి వరకు చూస్తే వేరే లెవెల్ అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు