ప్రభాస్ మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఆల్ మోస్ట్ ఫిక్స్.?

Published on Apr 16, 2021 12:00 pm IST

ఇప్పుడు మన ఇండియన్ సినిమాలోనే మోస్ట్ వాంటెడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. తాను పాన్ ఇండియన్ సినిమా చేసే స్థాయి నుంచి తన వల్ల సినిమా పాన్ ఇండియన్ స్థాయికి మారే లెవెల్ కి ఇప్పుడు ప్రభాస్ మారాడు. ఇక ఇప్పుడు మొత్తం నాలుగు పాన్ ఇండియన్ సినిమాలు తన చేతులో పెట్టుకొని బిజీగా ఉన్నాడు. మరి ఆల్రెడీ ఫిక్స్ కాబడిన ఈ చిత్రాల అనంతరం కూడా ప్రభాస్ సాలిడ్ లైనప్ తో ఉన్నాడని టాక్ ఇది వరకే ఉంది.

మరి ఆ లైనప్ లో ఓ సెన్సేషనల్ ప్రాజెక్ట్ తో బాలీవుడ్ యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్ సిద్దార్థ్ ఆనంద్ తో ఒకటి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ ప్రాజెక్ట్ ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అనే టాక్ వినిపిస్తుంది. ప్రభాస్ 24వ ప్రాజెక్ట్ గా ఇది తెరకెక్కకనుందట. అంతే కాకుండా ఈ భారీ ప్రాజెక్ట్ ను మన తెలుగుకి చెందిన ఓ భారీ నిర్మాణ సంస్థనే నిర్మించనుంది అని మరో రూమర్ ఉంది. మరి ఇది ఎంత వరకు నిజమో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :