స్పై లుక్ లో ప్రభాస్ ఫస్ట్ లుక్ అదుర్స్.

Published on May 21, 2019 12:35 pm IST

నిన్న చెప్పినట్లే ఓ సర్ప్రైజ్ గిఫ్టుతో తన డార్లింగ్స్ ముందుకొచ్చేసాడు ప్రభాస్. సాహో మూవీ ఫస్ట్ లుక్ ని ఫ్యాన్స్ కి పరిచయం చేసాడు. కళ్ళజోడు పెట్టుకొని తీక్షణంగా చూస్తున్నట్లు ఉన్న ప్రభాస్ ని చూస్తుంటే, “నానుండి ఎవరు తప్పించుకోలేరన్నట్లుంది”. అసలు ప్రభాస్ నేరస్థులను పట్టుకునే పోలీసా…. పోలీసులను ముప్పతిప్పలు పెట్టే సూపర్ దొంగా అనే విషయం తెలియాల్సివుంది. ఏదీఏమైనా ఈరోజు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో ప్రభాస్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నారు.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో దర్శకుడు సుజీత్ నిర్మిస్తున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన శ్రద్ధ కపూర్ చేస్తుండగా,స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15 విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More