పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా కెజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో శృతి హాసన్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న భారీ మాస్ యాక్షన్ మూవీ సలార్. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న సలార్ పార్ట్ 1 సీస్ ఫైర్ సెప్టెంబర్ 28న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, ఈశ్వరిరావు, తదితరులు కీలక పాత్రలు చేస్తున్న సలార్ నుండి ఫస్ట్ సాంగ్ ని రానున్న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, తాజాగా సలార్ మూవీ యొక్క డబ్బింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయట. ఇక ఈ సినిమాని ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునేలా దర్శకడు ప్రశాంత్ నీల్ అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని, అలానే తప్పకుండా ఇది అంచనాలు అందుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కాగా సలార్ కి రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై దీనిని గ్రాండ్ లెవెల్లో భారీ వ్యయంతో విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు.


