బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ కి నో చెప్పిన ప్రభాస్

బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ కి నో చెప్పిన ప్రభాస్

Published on Oct 29, 2015 4:32 PM IST

Prabhas
ఇన్ని రోజులు టాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రమే స్టార్ హీరోగా పరిచయం ఉన్న ప్రభాస్ కి ఈ ఏడాది వచ్చిన బాహుబలి సినిమా ఇంటర్నేషనల్ హీరోగా గుర్తింపును తెచ్చి పెట్టింది. బాహుబలి సినిమాలో ప్రభాస్ చేసిన రెండు పాత్రలకి చాలా మంచి పేరు వచ్చింది. బాహుబలి సినిమాతో ప్రభాస్ కి వచ్చిన గుర్తింపుతో నేషనల్ బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా మారాడు. అంతే కాకుండా ప్రభాస్ కి పలు బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ల నుంచి మంచి ఆఫర్స్ కూడా వస్తున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. యష్ రాజ్ ఫిలిమ్స్ నుంచి ప్రభాస్ ని ధూమ్ 4లో మెయిన్ విలన్ గా చేయమని అప్రోచ్ అయ్యారు.

ఈ వార్త గత కొద్ది రోజుల నుంచి న్యూస్ లో కూడా తెగ చక్కర్లు కొడుతోంది.. ఈ విషయంపై మేము ప్రభాస్ సన్నిహితులను అడిగి తెలుసుకోగా.. ప్రభాస్ కి యష్ రాజ్ ఫిలిమ్స్ నుంచి ఆఫర్ వచ్చిన మాట వాస్తవమే కానీ ప్రభాస్ ప్రసతుతం బాహుబలి పార్ట్ 2 కోసం సిద్దమవుతున్నాడు. అలాగే వచ్చే ఏడాదిలో 6 నెలలు పైనే బాహుబలి 2 షూటింగ్ లోబిజీ గా ఉంటాడు. అందుకే ప్రభాస్ తన దృష్టంతా బాహుబలి 2 మీదే పెట్టి, ధూమ్ 4 లో ఇప్పుడు నటించలేనని చెప్పేసాడని సమాచారం. కొంతమంది ఏమో ప్రభాస్ ధూమ్ లాంటి సీరీస్ ని వదులుకొని తప్పు చేసాడనే ఫీలింగ్ ని వ్యక్త పరుస్తున్నారు.

ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం బాహుబలి 2 సెట్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. డిసెంబర్ నుంచి బాహుబలి 2 రెగ్యులర్ షూట్ ని మొదలు పెట్టనున్నారు.

తాజా వార్తలు