పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న సెన్సేషనల్ చిత్రాల్లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో చేస్తున్న సినిమా ‘స్పిరిట్’ కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా షూట్ లో ఇపుడు ప్రభాస్ తన సరికొత్త లుక్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే సాలిడ్ షెడ్యూల్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమా నుంచి ప్రభాస్ తాలూకా లుక్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
తన హెయిర్ స్టైలిస్ట్ పూజా తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన పిక్ యిట్టె వైరల్ అయ్యిపోయింది. ఇక ఇందులో ప్రభాస్ లుక్ చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు. మంచి స్లిమ్ అండ్ గడ్డం పైగా నిలువు బొట్టు పెట్టుకొని ప్రభాస్ ఇందులో కనిపించడంతో సందీప్ తమ డార్లింగ్ తో ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని భావిస్తున్నారు. అయితే ఆమె కొంతసేపటికే ఈ పిక్ ని తొలగించింది. ఇలా మొత్తానికి ఈ కొత్త లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో కేజ్రీగా మారింది.


