ఇక ప్రభాస్ కూడా ఖాళీనే.. !

Published on Mar 18, 2020 7:05 am IST

మొన్నటి వరకు ప్రభాస్ జార్జియా దేశంలో జరిగిన షూటింగ్ షెడ్యూల్ నందు పాల్గొన్నారు. అక్కడ ఎముకలు కొరికే చలి, వర్షం వంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ అనుకున్న ప్రకారం షూటింగ్ పూర్తి చేశారు. ఇక ఈ షెడ్యూల్ నందు హీరోయిన్ పూజ హెగ్డే కూడా పాల్గొన్నారు. ప్రభాస్ మరియు పూజ పై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ సాంగ్ కూడా చిత్రీకరించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇండియా చేరుకున్న ప్రభాస్ టీమ్ స్వల్ప విరామం తీసుకోనున్నారు.

కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా అన్ని చిత్రాల షూటింగ్స్ కి మార్చి 31వరకు బంద్ ప్రకటించిన నేపథ్యంలో ప్రభాస్ మూవీ షూటింగ్ కూడా కొద్దిరోజులు నిలిచిపోనుంది. ఏప్రిల్ నుండి నెక్స్ట్ షెడ్యూల్ మెదలుకానుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ మూవీ తెరకెక్కుతుండగా.. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషలలో విడుదల కానుంది. పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More