ఒకే దగ్గర ప్రభాస్ మూడు చిత్రాలు..!

Published on May 16, 2021 8:37 am IST

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ సూపర్ స్టార్ హీరోగా అవతరించిన హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. మరి తాను హీరోగా ఇప్పుడు నాలుగు భారీ చిత్రాలను చేతిలో పెట్టుకొని ఏకకాలంలో ఒక్కో చిత్రానికి ఒక్కో మేకోవర్ తో సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. అయితే ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న చిత్రాలు “రాధే శ్యామ్”, “సలార్” అలాగే “ఆదిపురుష్” ఒక్కో దానిపై ఒక్కో అంచనాలు ఉన్నాయి.

మరి ఇదిలా ఉండగా కొన్ని రోజుల్లో ఈ మూడు చిత్రాలు కూడా ఒకే దగ్గర షూటింగ్ జరుపుకోనున్నాయి. మొదటగా రాధే శ్యామ్ బ్యాలన్స్ ప్యాచ్ వర్క్ అండ్ రీ షూట్స్ హైదరాబాద్ లోనే ప్లాన్ చేశారు. కానీ దాని తర్వాత ఆదిపురుష్ యూనిట్ కూడా ఏకంగా 150 రోజుల షూట్ ను ఇక్కడికే షిఫ్ట్ చేశారు. అలాగే సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్లాన్ చేసిన బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” నెక్స్ట్ షెడ్యూల్ కూడా హైదరాబాద్ లోనే ఉంది. సో ఇలా ప్రభాస్ ఓకే దగ్గర మూడు సినిమాలు షూట్ కానిచ్చేయనున్నాడు.

సంబంధిత సమాచారం :