ఇంట్రెస్టింగ్..బాస్ బర్త్ డే సెలెబ్రేషన్స్ లో ప్రభాస్.!

Published on Aug 21, 2021 3:01 pm IST

లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజుకి ఇంకా కొన్ని గంటలే సమయం ఉన్నందున మెగా ఫ్యాన్స్ ఈసారి వేడుకలు కూడా తారా స్థాయిలో జరపాలని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ ఎన్నో భారీ ప్లానింగులు అటు ఆన్ లైన్ మరియు ఇటు ఆఫ్ లైన్ లో కూడా చేసిన మెగా ఫ్యాన్స్ ఈసారి మరింత స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఇప్పుడు ట్రెండ్ మారుతుండడంతో తమ అభిమాన హీరోల కోసం యాతర హీరోలను కూడా కొన్ని ఆన్ లైన్ మీటింగ్స్ కి స్పెషల్ గెస్టులుగా ఆహ్వానిస్తున్నారు. మరి ఇస్రాయి బాస్ బర్త్ డే పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ పాల్గొననున్నట్టు తెలుస్తుంది. ఈరోజు జరిగే జూమ్ మీట్ లో ప్రభాస్ పాల్గొననున్నట్టుగా తాజా సమాచారం. దీనితో ప్రభాస్ ఈ మీటింగ్ లో ఏ చెప్పనున్నాడు అన్న దానిపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :