ప్రభాస్ ఖాతాలో మరో అరుదైన రికార్డ్ !

Published on Sep 26, 2020 5:47 pm IST

బాహుబ‌లి సిరీస్ అండ్ ‘సాహో’ చిత్రాలతో నేషనల్ స్టార్ అయిపోయాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఇండియా వైజ్ గా ప్రభాస్ కు అశేషమైన అభిమానగణం ఉందనే విషయం మరోసారి రుజువు అయింది. ఈ డిజిటల్ యుగంలో సోష‌ల్ మీడియాలో ఎవరికీ ఎక్కువ ఫాలోవ‌ర్స్ ఉంటే, వారికే ఎక్కువ పాపులారిటీ ఉందని అంచనా వేసే రోజులు ఇవి. అందుకే మన స్టార్ హీరోలు కూడా ఫేస్ బుక్ దగ్గర నుండి ఇన్ స్టా, ట్విట్ట‌ర్ లాంటి మాధ్య‌మాల్లో యాక్టివ్ గా ఉంటూ తమ ఫాలోవర్స్ ను ఫాలోయింగ్ ను పెంచుకోవడానికి తాపత్రయపడతారు. అయితే తాజాగా డిజిట‌ల్లో రెబల్ స్టార్ ప్రభాస్ ఓ అరుదైన‌ ఘనత సాధించాడు.

ప్రభాస్ ఫేస్ బుక్ పేజికి 20 మిలియన్ల పాలోవర్స్ వచ్చి చేరారు. 20 మిలియన్ల పాలోవర్స్ చేర‌డం అనేది సంచ‌ల‌న‌మే. పైగా ఇప్పటి వరకూ ఏ హీరోకి అంతమంది పాలోవర్స్ లేరు. సౌత్ ఇండియాలో ఎక్కువమంది పాలోవర్స్ ఉన్న హీరోగా ఫేస్ బుక్ లో రికార్డు న‌మోదు చేసిన క్రెడిట్ కూడా ప్రభాస్ కే దక్కుతుంది. మొత్తానికి బాహుబ‌లి క్రేజుతో టాప్ లోకి దూసుకొచ్చిన ప్ర‌భాస్ ఇప్ప‌టికి ఫేస్ బుక్ లో నంబ‌ర్ వ‌న్ స్థానం అందుకోవడం ప్రభాస్ ఫ్యాన్స్ కి ఆనందాన్ని ఇచ్చే విషయమే.

మొత్తానికి సోషల్ మీడియా ప్రభావం హీరోల మీద కూడా బాగా పడింది. సీనియర్ హీరోలు చిరంజీవి, మోహన్ బాబు, నాగ్, వెంకీ.. చివరికీ రాజశేఖర్ కూడా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్స్ తో అభిమానులను ఉత్తేజపరుస్తున్నారంటే.. సోషల్ మీడియా ప్రభావం ఎంతగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

సంబంధిత సమాచారం :

More